అక్షరటుడే, వెబ్‌డెస్క్: Godavari Water Supply | ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్ (Hyderabad) నగరంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంజీర–సింగూరుకు ప్రత్యామ్నాయంగా గోదావరి జలాలు తరలించేందుకు పనులు చేపట్టారు. ఈ పనులు తుది దశకు చేరుకున్నాయని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు.
మల్లన్నసాగర్ నుంచి ఘన్పూర్ మాస్టర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలను తరలించేందుకు చేపడుతున్న 1600 మి.మీ. వ్యాసం గల మిషన్ భగీరథ- జలమండలి పైప్‌లైన్ అనుసంధాన పనులను రెండు రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎండీ అశోక్‌రెడ్డి మిషన్ భగీరథ ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డితో కలిసి శుక్రవారం పైప్‌లైన్ అనుసంధాన పనులను పరిశీలించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, ట్రయల్ రన్‌కు సిద్ధం కావాలని ఆదేశించారు.
Godavari Water Supply | రాతి పొరలతో జాప్యం
ఈ నెల 15 నాటికే పైప్‌లైన్ నిర్మాణం, అనుసంధానం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. అటవీ ప్రాంతం మీదుగా వెళ్లే పైప్‌లైన్ మార్గంలో రాతి పొరలు ఉన్నాయి. వాటిని తొలగించాల్సి రావడంతో పనుల్లో ఆలస్యం అయిందని అధికారులు తెలిపారు. ఎల్‌నినో నేపథ్యంలో సింగూరు- మంజీరా జలవనరుల్లో నీటి లభ్యత తగ్గుతోంది. దీంతో రోజుకు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలను నగరానికి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సింగూరు- మంజీరా జలాలపై ఆధారపడిన ప్రాంతాలకు నీటి సరఫరాలో ఏర్పడే లోటులో 50 శాతాన్ని గోదావరి అదనపు జలాలను తరలించి భర్తీ చేయనున్నారు.
ఇది కూడా చదవండి..: Harish Rao | రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుంది : హరీశ్‌రావు