అక్షరటుడే, వెబ్‌డెస్క్: Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి భయం పట్టుకుందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అందుకే ఫ్రస్టేషన్లో మాట్లాడుతున్నారని విమర్శించారు.
మెదక్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు శుక్రవారం బీఆర్ఎస్లో చేరారు. వారిని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సిద్దిపేట సభలో రేవంత్ రెడ్డి గంటలో 140 సార్లు తమ పేర్లు తలుచుకున్నారని చెప్పారు. 63 సార్లు కేసీఆర్ పేరు, 53 సార్లు తన పేరు, 24 సార్లు కేటీఆర్ పేరు తీశారన్నారు. ఆయనకు ఎంత భయం పట్టుకున్నదో దీనిని బట్టి అర్థం అవుతోందన్నారు. ఇందిరమ్మ జీవిత బీమా మీద సభ పెట్టి దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. తన పని అయిపోయిందని తెలియడంతోనే ఫ్రస్టేట్ అవుతున్నారని ఎద్దేవా చేశారు.
Harish Rao | ప్రతిపక్ష హోదా కూడా రాదు
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని హరీశ్ రావు అన్నారు. అన్ని జిల్లాల నుండి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. కొత్తవి ఇచ్చుడు కాదు.. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు కూడా రేవంత్ రెడ్డి బంద్ పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, నాయకులు కంఠంరెడ్డి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: CM Revanth Reddy | తెలంగాణలో ఓటు చోరీ జరగలేదు : సీఎం రేవంత్ రెడ్డి