అక్షరటుడే, వెబ్‌డెస్క్: CM Revanth Reddy | దేశవ్యాప్తంగా ఓటు చోరీ జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో ఓటు చోరీ జరగలేదన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదని, ఓటు చోరీ జరగలేదు అనడానికి ఇదే నిదర్శనం అన్నారు.
ఓ జాతీయ ఛానెల్‌తో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అన్నారు. బీజేపీ రేసులో లేదని చెప్పారు. తన మూడేళ్ల పాలనకు ఆయన 65 మార్కులు ఇచ్చుకున్నారు. త్వరలో ఫుట్ బాల్ ప్లేయర్ రొనాల్డోను తెలంగాణకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
CM Revanth Reddy | 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ
తెలంగాణ (Telangana)ను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తన లక్ష్యమని సీఎం అన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పారు. జీడీపీలో తెలంగాణ వాటా 5 శాతం ఉందని, దీనిని 2047 నాటికి 10 శాతానికి పెంచుతామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. మౌలిక వసతులు మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. దేశంలో నిరంకుశ ధోరణులను ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి..: SI Hall Tickets | ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్లు విడుదల.. 29న ఎగ్జామ్