Development Funds | నిధుల విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి : ఎమ్మెల్యే ధన్​పాల్

నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ కోరారు.

shashi kiran Mottala

అక్షరటుడే,ఇందూరు : Development Funds | నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిధులు విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ (Urban MLA Dhanpal Suryanarayana) కోరారు. నగరంలోని 42వ డివిజన్​లో ఉన్న చంద్రశేఖర్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.

Development Funds | స్పెషల్​ ఫండ్​ విడుదల చేస్తే..

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్పెషల్ ఫండ్ విడుదల చేస్తే మరింత అభివృద్ది జరిగే అవకాశం ఉందన్నారు. రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలన్నారు. తన అంతిమ లక్ష్యం కూడా అదే అని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్పెషల్ ఫండ్ విడుదల చేసేలా చూడాలన్నారు. ఇప్పటికే తాను అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు. కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు బెల్లాల్ శశాంక్, పసునూరి రాము, మఠం పవన్ బీజేపీ మండల అధ్యక్షుడు ఆనంద్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Limbadri Guest House | లింబాద్రి గుట్టపై రూ.4 కోట్లతో అతిథి గృహం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *