Limbadri Guest House | లింబాద్రి గుట్టపై రూ.4 కోట్లతో అతిథి గృహం..

శ్రీలింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్‌గల్: Limbadri Guest House | ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీలింబాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ స్పష్టం చేశారు. ఆలయ ప్రాంగణంలో రూ.4 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన అతిథి గృహ పనులకు స్థానిక నాయకులతో కలిసి వారు భూమిపూజ చేశారు.

Limbadri Guest House | కొండలు, అడవుల నడుమ ఆహ్లాదకర క్షేత్రం: మంత్రి సీతక్క

అంతకుముందు స్వామివారికి మంత్రి, పీసీసీ చీఫ్​ (Mahesh Kumar Goud) ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. కొండలు, అడవుల మధ్య కొలువైన లింబాద్రి స్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు పంచాయతీరాజ్‌ శాఖ నుంచి రూ.4 కోట్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు కొత్త పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో సాగుతోందని చెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మరిన్ని నిధులు కేటాయించి సంక్షేమం, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు.

Limbadri Guest House | ఆర్నెళ్లలో భక్తులకు అందుబాటులోకి..: మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Limbadri Guest House

లింబాద్రి గుట్ట వెనుక ఉన్న రహత్‌నగర్‌ తన స్వగ్రామమని, గత 58 ఏళ్లుగా స్వామివారిని దర్శించుకుంటున్నానని మహేశ్‌కుమార్‌ గౌడ్‌ గుర్తుచేసుకున్నారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ అతిథి గృహం నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా భావించానని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే ఆయన మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావులతో మాట్లాడి తక్షణమే రూ.4 కోట్లు మంజూరు చేశారని వివరించారు. ఆర్నెళ్లలోపు నిర్మాణం పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ఆలయ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటుతామన్నారు. సిద్దిపేట సభలో సీఎం ప్రకటించినట్లుగా ప్రతి ఇంటికీ రూ.5 లక్షల బీమా పథకంతో పాటు అర్హులందరికీ కొత్త పింఛన్లు అందిస్తూ పేదల ప్రభుత్వంగా నిలుస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నగేష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు సునీల్‌రెడ్డి, ఈరవత్రి అనిల్‌, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Talari Balaiah | కష్టాల కొలిమిలోంచి న్యాయస్థానపు ఉన్నత పీఠంపైకి.. తలారి బాలయ్య స్ఫూర్తిదాయక ప్రస్థానం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *