అక్షరటుడే, ఇందూరు: Enumeration Forms | ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు త్వరగా బీఎల్వోలకు అందజేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు.
Enumeration Forms | డిజిటలైజేషన్ చేయాల్సి ఉన్నందున..
ఎన్యుమరేషన్ ఫారాలను వివరాలను డిజిటలైజ్ చేయాల్సి ఉన్నందున ఫారాలను వెంటనే తిరిగి ఇచ్చేయాలని కలెక్టర్ (Collector Ila Tripathi) కోరారు. అంతేకాకుండా ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్/డిలీటెడ్ (ఏఎస్డీ) ఓటర్ల జాబితాను సైతం రూపొందించాల్సి ఉన్నందున చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటదివెంట ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందించాలని సూచించారు. ప్రత్యేకించి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లు ఫారం అందజేసే విషయంలో తాత్సారం చేయవద్దని సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం అందించకపోతే ఓటరు జాబితా నుంచి పేరు గల్లంతు అవుతుందని తెలిపారు.
Enumeration Forms | 2002 ఓటరు జాబితాలో పేరు లేకపోతే..

ఒకవేళ ఎవరికైనా గత 2002 ఎస్ఐఆర్ వివరాలు తెలియకపోతే సర్కిల్ వారీగా నెలకొల్పిన హెల్ప్ డెస్క్‌ను, లేదా బీఎల్వోలను సంప్రదించాలని సూచించారు. అయినప్పటికీ వివరాలు తెలియని పక్షంలో ప్రస్తుత ఓటరు జాబితా వివరాలు పొందుపర్చి ఫారం సమర్పించవచ్చని అన్నారు. అలాంటి వారి పేరు కూడా ముసాయిదా ఓటరు జాబితాలో చేర్చబడుతుందని తెలిపారు. వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఈఆర్వో) నోటీసు జారీ చేసి హియరింగ్‌కు పిలుస్తారన్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు ధృవీకరణ పత్రాలలో ఏదైనా ఒక దానిని చూపిస్తే ఓటరు తుది జాబితాలో పేరు చేరుస్తారని అన్నారు.
Enumeration Forms | బీఎల్ఏలు చురుకుగా స్పందించాలి..
ఈ విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు క్షేత్రస్థాయిలో ఉంటూ క్రియాశీలక పాత్ర పోషించాలని, ప్రతి రోజు ఓటర్ల నుండి 50 చొప్పున ఫారంలు సేకరించి బీఎల్ఏలకు అందించేలా చొరవ చూపాలన్నారు. ఈఆర్ఓలు, ఏఈఆర్వో కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ, ఎన్యుమరేషన్ ఫారంల సేకరణ, వాటి డిజిటలైజేషన్ ప్రక్రియలు వేగవంతం అయ్యేలా పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అందుబాటులో లేని, చనిపోయిన, శాశ్వతంగా వలస వెళ్లిన, రెండు చోట్ల ఓటు కలిగిన ఓటర్ల పేర్లను గుర్తిస్తూ పక్కాగా జాబితాను రూపొందించి, వాటిపై బీఎల్ఏల సంతకాలు తీసుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి..: Nizamabad Rice Exports | ఎల్లలు దాటుతున్న ఇందూరు బియ్యం.. యూకేకు ఎగుమతులు ప్రారంభించిన కలెక్టర్