Vaishali Nagar Underpass | నగరవాసులకు అలర్ట్​.. వైశాలినగర్​ అండర్​పాస్​ మూసివేత

సైబరాబాద్​ పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద పనులు చేపడుతున్నారు. 20 రోజుల పాటు ఈ మార్గం మూసి ఉంటుందని పోలీసులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Vaishali Nagar Underpass | సైబరాబాద్​ (Cyberabad) పరిధిలోని వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వద్ద రోడ్డు విస్తరణ, వర్షపు నీటి కాలువ (stormwater drain) నిర్మాణ పనులు చేపట్టనున్నారు. దీంతో జూలై 16 నుంచి 20 రోజుల పాటు ఆ మార్గం పూర్తిగా మూసివేయబడుతుందని సైబరాబాద్ ట్రాఫిక్​ జాయింట్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ ప్రకటించారు.

వైశాలి నగర్​ అండర్‌పాస్ ఇరుకుగా ఉంది. భారీ వర్షాల సమయంలో తరచుగా నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఈ సమస్య పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీనిని విస్తరించడంతో పాటు సరైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో 20 రోజుల పాటు అండర్​పాస్​ మూసి వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Vaishali Nagar Underpass | ట్రాఫిక్​ మళ్లింపు ఇలా..

Vaishali Nagar Underpass

మై హోమో అపార్ట్‌మెంట్స్ నుంచి హఫీజ్‌పేట్ నగర్ వెళ్లే వారు రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు యు-టర్న్ తీసుకుని, హై-టెన్షన్ రోడ్, కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం మీదుగా వెళ్లాలి. తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ నుంచి వైశాలి నగర్ రైల్వే అండర్‌పాస్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను, మై హోమ్ మంగళ టి జంక్షన్ వద్ద రాఘవేంద్ర నగర్ కాలనీ వైపు మళ్లిస్తారు. మైహోమ్ జ్యువెల్ వెనుక గేటు, ఆర్టీసీ కాలనీ మంజీరా పైప్‌లైన్ రోడ్డు నుంచి వైశాలి నగర్​ రైల్వే అండర్‌పాస్ మీదుగా మైహోమ్ మంగళ వైపు వెళ్లే వాహనదారులు పైప్‌లైన్ రోడ్డుపై హఫీజ్‌పేట్ ఆర్​వోబీ/ఫ్లైఓవర్ వైపు మీదుగా వెళ్లాలి. గోపాల్ నగర్ ఓల్డ్ హఫీజ్‌పేట్ నుంచి మై హోమ్ మంగళ వైపు వచ్చే ప్రజలు హఫీజ్‌పేట్ ఆర్‌యూబీ/అండర్‌పాస్ వద్ద కుడివైపుకు తిరిగి, కొండాపూర్-ఆల్విన్ జంక్షన్ రోడ్డు మీదుగా వెళ్లాలి.

ఇది కూడా చదవండి..: Madhapur Murder Case | ప్రేమ వ్యవహారం.. మాదాపూర్‌లో యువకుడి దారుణ హత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *