Drug and Cybercrime Awareness | డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు చర్యలు : సీపీ సాయిచైతన్య

డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ సాయిచైతన్య అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే నిజామాబాద్ క్రైం: Drug and Cybercrime Awareness | డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. మంగళవారం నగరంలోని (Nizamabad) సీపీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (NSC) సమావేశంలో ఆయన మాట్లాడారు.

Drug and Cybercrime Awareness | అవగాహన కార్యక్రమాలు..

జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, మెడికల్ కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ వినియోగం, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రత వంటి సామాజిక సమస్యలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ సూచించారు. యువత మాదకద్రవ్యాలకు ఆకర్షితులు కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి విద్యాసంస్థలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థుల్లో బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించాలన్నారు.

Drug and Cybercrime Awareness | సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం..

ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సాయిచైతన్య తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగిరి, గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి, ఎన్‌ఎస్‌సీ జనరల్ సెక్రటరీ డాక్టర్ కవితా రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ ప్రకాష్, ఏసీపీ మస్తాన్ అలీ, ఎన్‌ఎస్‌సీ జాయింట్ సెక్రటరీలు సీహెచ్. రజనీకాంత్, కె. సిరీష్, వి. దుశాంత్, ఉష, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.

ఇది కూడా చదవండి: అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *