అక్షరటుడే, ఇందూరు: Gopashtami Celebrations | సనాతన ధర్మంలో గోమాతను, స్త్రీని పూజించే భూమి పావనమవుతుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ అన్నారు. గోశాల కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని గోపాల్ బాగ్లో గోపాష్టమి వేడుకలు నిర్వహించారు.
Gopashtami Celebrations | హిందూ ధర్మంలో గోమాతకు ప్రత్యేక స్థానం..
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందూ ధర్మంలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. గోమాతను పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన పుణ్యం వస్తుందన్నారు. ఇందూరు గోశాలకు దక్షిణ భారతదేశంలోనే పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నారు. ఈ గోశాలకు సుమారు వందేళ్ల చరిత్ర ఉందన్నారు. భవిష్యత్తులో గోశాలకు ఎటువంటి అవసరం ఉన్నా.. తాను ముందుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గోశాల కమిటీ అధ్యక్షుడు పవన్ కేడియా, ట్రస్ట్ అధ్యక్షుడు కైలాష్ గోయెంకా, కార్యదర్శులు మాస్టర్ శంకర్, కమల్ ఇనాని, కోశాధికారి ధన్పాల్ శ్రీనివాస్, సీనియర్ ట్రస్ట్ మెంబర్ ప్రదీప్ జై భీమానీ, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోటూరి దయానంద్ గుప్తా, ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రాజు, రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధి ధన్పాల్ దత్తు, బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement | సీఎం దూరదృష్టితోనే రైతులకు రికార్డుస్థాయి ధర