Diversified Crop Cultivation | విభిన్న పంటల సాగుతో మెరుగైన ఆదాయం..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

వరిసాగును వదిలి.. విభిన్నమైన పంటలు సాగు చేస్తూ మెరుగైన ఆదాయం పొందుతున్న రైతును రాజన్న సిరిసిల్ల కలెక్టర్​ గరిమ అగ్రవాల్​ అభినందించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Diversified Crop Cultivation | వరిసాగును వదిలి.. విభిన్నమైన పంటలు సాగు చేస్తూ మెరుగైన ఆదాయం పొందుతున్న రైతును రాజన్న సిరిసిల్ల (Rajanna sirisilla) కలెక్టర్​ గరిమ అగ్రవాల్​ అభినందించారు. ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామంలో చింతలకుల చంద్రం సాగు చేస్తున్న పంటలను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

Diversified Crop Cultivation | కూరగాయల సాగుతో..

ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన రైతు చింతలకుల చంద్రం సాంప్రదాయంగా సాగుచేస్తున్న వరిని వదిలి కూరగాయలు పండిస్తున్నారు. పామ్ ఫౌండ్ ఏర్పాటు చేసుకుని దానికి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేసి మూడు ఎకరాల విస్తీర్ణంలో దోసకాయ, కాకరకాయ, బీరకాయ, టమాట, పచ్చిమిర్చి, వేరుశనగ సాగు చేస్తున్నారు. నీటిని సద్వినియోగం చేసుకుంటూ.. ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సాగు చేస్తూ నిరంతరం ఆదాయం వచ్చేలా ముందుకు సాగుతున్నారు.

Diversified Crop Cultivation | రూ.4 లక్షల ఆదాయం

ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామానికి చెందిన రైతు చింతలకుల చంద్రం ఆదర్శంగా కూరగాయల సాగు చేస్తుండగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగు విధానాన్ని తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో వేశారు..? దిగుబడి ఎంత వస్తుంది..? ఎక్కడ విక్రయిస్తారు..? ఆదాయం ఎంత వస్తుందని రైతును ఆరా తీశారు. తనకు మూడు ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగుతో ఏడాదికి రూ.3 నుంచి రూ.4లక్షల ఆదాయం వస్తుందన్నారు. పంట ఉత్పత్తులు ముస్తాబాద్, సిరిసిల్లలో విక్రయిస్తామని కలెక్టర్ దృష్టికి రైతు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, వ్యవసాయ శాఖ అధికారి ప్రదీప్, తహశీల్దార్ ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *