TIMS Sanathnagar Trial | సమస్త వైద్య సేవల సమాహారం టిమ్స్​.. ఈ వైద్యాలయ ప్రత్యేకతలు ఎన్నో.. నేటి నుంచి ఓపీ!

Naresh Chandan
TIMS

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TIMS Sanathnagar Trial | హైదరాబాద్ మహా నగరంలో వైద్య రంగానికి మరో కీలక అభివృద్ధిగా మారిన సనత్​నగర్​లోని Telangana Institute of Medical Sciences (టిమ్స్) ప్రారంభానికి సిద్ధమవుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి Damodar Rajanarasimha ఆదేశాల మేరకు ఆసుపత్రిలో ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

TIMS Sanathnagar Trial | నెల రోజుల పాటు

ఈ ట్రయల్ రన్ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుంది. దాదాపు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్‌పేషెంట్ (OP), డయాగ్నస్టిక్ సేవలు అందించనున్నారు.

TIMS Sanathnagar Trial | 22 విభాగాల్లో..

మొత్తం 22 విభాగాల్లో సేవలు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వంటి ముఖ్య విభాగాలు ఉన్నాయి.

ట్రయల్ రన్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని ఇప్పటికే నియమించినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. పూర్తి స్థాయి సేవలు ప్రారంభానికి ముందుగా ఈ ట్రయల్ రన్ కీలకంగా మారనుంది.

TIMS ప్రత్యేకతలు..

  • సూపర్ స్పెషాలిటీ వైద్యం: హార్ట్, కిడ్నీ, లివర్, బ్రెయిన్, లంగ్స్ వంటి ముఖ్య అవయవాలకు ప్రత్యేక విభాగాలు. 30కి పైగా డిపార్ట్‌మెంట్లు, 15+ సూపర్ స్పెషాలిటీలు.
  • అతిపెద్ద ఆసుపత్రి: సుమారు 1000+ పడకలు (బెడ్స్). 300 వరకు ICU బెడ్స్. పెద్ద స్థాయిలో అత్యవసర సేవలు.
  • అత్యాధునిక టెక్నాలజీ: MRI, CT Scan, క్యాథ్ ల్యాబ్. క్యాన్సర్ చికిత్స (రేడియేషన్, కెమోథెరపీ). డయాలసిస్, అడ్వాన్స్‌డ్ ఆపరేషన్ థియేటర్లు.
  • ఉచిత, తక్కువ ఖర్చుతో చికిత్స: పేద– మధ్యతరగతి ప్రజలకు భారీ ఉపశమనం. కార్పొరేట్ హాస్పిటళ్లతో పోలిస్తే తక్కువ ఖర్చు, ఉచిత సేవలు.
  • వైద్య విద్య & రీసెర్చ్: PG కోర్సులు, నర్సింగ్, పారామెడికల్ ట్రైనింగ్. రీసెర్చ్ సెంటర్‌గా కూడా అభివృద్ధి.
  • అంతర్జాతీయ స్థాయి సేవలు: విదేశీ రోగులకు ప్రత్యేక సూట్స్, మెడికల్ టూరిజం అభివృద్ధి లక్ష్యం.

TIMS ఏర్పాటుతో కలిగే లాభాలు.

  • పేదలకు నాణ్యమైన వైద్యం: ప్రైవేట్ హాస్పిటళ్లలో ఖరీదైన చికిత్సలు — ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అందుబాటులోకి వస్తాయి.
  • కార్పొరేట్ హాస్పిటళ్లపై ఆధారపడటం తగ్గింపు: ప్రభుత్వ ఆసుపత్రులే హై-ఎండ్ ట్రీట్మెంట్ ఇస్తుండడంతో ఖర్చు తగ్గుతుంది.
  • హైదరాబాద్‌లో ఆరోగ్య సదుపాయాల విస్తరణ: గాంధీ, ఉస్మానియా వంటి ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుంది
  • అత్యవసర చికిత్స త్వరగా: ICU, ట్రామా కేర్ వంటి సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయి.
  • మెడికల్ టూరిజం పెరుగుదల: విదేశీ రోగులు రావడం ద్వారా రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది.

    ఉద్యోగ అవకాశాలు: డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లకు పెద్దఎత్తున ఉద్యోగాలు.

Iran Gulf Tensions | పర్షియన్ గల్ఫ్‌లో ‘ఇరాన్’ కొత్త నిబంధనలు.. అమెరికాకు ఇక నో ఎంట్రీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *