బిజినెస్​May 01 Gold Rates | రోజు రోజుకి ప‌డిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లోనే...

May 01 Gold Rates | రోజు రోజుకి ప‌డిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లోనే భారీ పతనం!

గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రెండు రోజుల్లోనే తులం బంగారం రూ.3 వేల వరకు, వెండి కిలోకు రూ.10 వేల వరకు పడిపోవడం మార్కెట్‌లో చర్చనీయాంశమైంది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 01 Gold Rates | బంగారం, వెండి కొనుగోలుదారులకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. గతంలో వరుసగా పెరుగుతూ వచ్చిన ఈ విలువైన లోహాల ధరలు ఇప్పుడు గణనీయంగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా ధరలు పడిపోతుండటంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభిస్తోంది.

దేశీయ మార్కెట్లో మే 1న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670 వద్ద నమోదైంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,38,110 కాగా, 18 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,13,000గా ఉంది. మరోవైపు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కిలో వెండి ధర Silver Price Kerala రూ.2,49,000 వద్ద ట్రేడవుతోంది.

May 01 Gold Rates | ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, కేరళ వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,670గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,38,110గా ఉంది.

ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,50,820, 22 క్యారెట్ల ధర రూ.1,38,260గా ఉంది. చెన్నైలో మాత్రం ధరలు మరింత ఎక్కువగా ఉండి 24 క్యారెట్ల బంగారం రూ.1,53,830, 22 క్యారెట్ల బంగారం రూ.1,41,010 వద్ద కొనసాగుతోంది.

వెండి విషయానికొస్తే హైదరాబాద్, చెన్నై, కేరళలో కిలో ధర రూ.2,70,000గా ఉండగా, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో రూ.2,49,900 వద్ద ఉంది.

May 01 Gold Rates | డాలర్ బలపడటం

స్టాక్ మార్కెట్లో లాభాల స్వీకరణ (Profit Booking) పెరగడం, ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనలు మళ్లీ ముందుకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారం నుంచి కొంతమేర వెనక్కి తగ్గుతున్నారు. మరోవైపు అమెరికా డాలర్ బలపడటం కూడా బంగారం ధరలపై ఒత్తిడి పెంచుతోంది.

అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరిని కొనసాగించే అవకాశాలు ఉండటం, అంతర్జాతీయంగా అమెరికా–ఇరాన్ మధ్య ఉన్న అనిశ్చితి పరిస్థితులు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం కనిపిస్తున్న ధరలు ప్రాథమిక మార్కెట్ రేట్లు మాత్రమే. బంగారం లేదా వెండి కొనుగోలు చేసే సమయంలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు Making Charges మరియు ఇతర పన్నులు అదనంగా వర్తిస్తాయి.

అలాగే నగరాల వారీగా స్థానిక జ్యువెలరీ అసోసియేషన్ల నిర్ణయాల ప్రకారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది. ధరలు తగ్గుతున్న ఈ సమయంలో కొనుగోలుదారులు సరైన సమయాన్ని ఉపయోగించుకుంటే లాభపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.

Mother Son SSC Success | ఒకేసారి పదో తరగతి పరీక్షల్లో పాస్ అయిన తల్లి, కొడుకు

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Padakal Palm Fire | ఈతవనంలో కార్చిచ్చు.. అగ్నికి ఆహుతైన 200 ఈత చెట్లు!

అక్షరటుడే ఆర్మూర్: Padakal Palm Fire | నిజామాబాద్​ జిల్లా జక్రాన్‌పల్లి...

LPG Price Hike | కమర్షియల్​ సిలిండర్​ ధర భారీగా పెంపు.. గృహ వినియోగదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: LPG Price Hike | దేశంలో వాణిజ్య అవసరాలకు...

TIMS Sanathnagar Trial | సమస్త వైద్య సేవల సమాహారం టిమ్స్​.. ఈ వైద్యాలయ ప్రత్యేకతలు ఎన్నో.. నేటి నుంచి ఓపీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TIMS Sanathnagar Trial | హైదరాబాద్ మహా నగరంలో...