అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aug 28 Gold Prices | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. వారంవారీగా పసిడి ధర దాదాపు 2 శాతం మేర క్షీణించినప్పటికీ.. ఏడాది కాలంలో మాత్రం సుమారు 56 శాతం పెరుగుదలను నమోదు చేసింది. శుక్రవారం ఉదయం 6.40 గంటల సమయంలో Bullion.co.in ప్రకారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,59,610గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,309గా ఉంది. మరోవైపు వెండి ధర కిలోకు రూ.2,41,800 వద్ద కొనసాగింది. వారం రోజుల్లో వెండి ధర 2 శాతానికి పైగా తగ్గినప్పటికీ.. గత ఏడాదితో పోలిస్తే 105 శాతానికి పైగా పెరగడం గమనార్హం.
Aug 28 Gold Prices | హైదరాబాద్‌లో పసిడి ధర
హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.16,297గా ఉంది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.14,939 కాగా, 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,223గా నమోదైంది. 10 గ్రాముల ప్రాతిపదికన చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,570గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,273గా ఉంది.
Aug 28 Gold Prices | ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధరలను పరిశీలిస్తే, ముంబైలో 10 గ్రాములకు రూ.1,59,320గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,040గా ఉంది.
Nepal Barrier Lake | నేపాల్‌కు మరో పెను ముప్పు.. బారియర్ సరస్సు బద్దలైతే భారీ వరద ముప్పు
చెన్నై Chennai లో ఇదే పరిమాణం బంగారం రూ.1,59,780తో అత్యధికంగా నమోదైంది. కోల్‌కతాలో 10 గ్రాములకు రూ.1,59,110గా, బెంగళూరు Bengaluru లో రూ.1,59,440గా, హైదరాబాద్‌లో రూ.1,59,570గా 24 క్యారెట్ల బంగారం ధరలు ఉన్నాయి.
22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే, ముంబైలో 10 గ్రాములకు రూ.1,46,043గా ధర నమోదైంది. ఢిల్లీలో రూ.1,45,787గా, చెన్నైలో రూ.1,46,465గా, కోల్‌కతాలో రూ.1,45,851గా, బెంగళూరులో రూ.1,46,153గా, హైదరాబాద్‌లో రూ.1,46,273గా 22 క్యారెట్ల బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
Aug 28 Gold Prices | ప్రధాన నగరాల్లో వెండి ధరలు
999 ఫైన్ వెండి ధరలను పరిశీలిస్తే, ముంబైలో కిలోకు రూ.2,41,370గా నమోదైంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,40,950గా ఉండగా, చెన్నైలో రూ.2,42,070తో అత్యధికంగా ఉంది. కోల్‌కతాలో కిలోకు రూ.2,41,050గా, బెంగళూరులో రూ.2,41,560గా, హైదరాబాద్‌లో రూ.2,41,750గా 999 ఫైన్ వెండి ధరలు నమోదయ్యాయి.