బిజినెస్​LPG Price Hike | కమర్షియల్​ సిలిండర్​ ధర భారీగా పెంపు.. గృహ వినియోగదారులకు ఊరట!

LPG Price Hike | కమర్షియల్​ సిలిండర్​ ధర భారీగా పెంపు.. గృహ వినియోగదారులకు ఊరట!

ఈ పరిణామాలతో వాణిజ్య రంగంపై ప్రభావం ఉండే అవకాశం ఉండగా, గృహ వినియోగదారులకు మాత్రం కొంత ఉపశమనం లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: LPG Price Hike | దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 993 పెంచినట్లు సమాచారం. దీంతో దేశ రాజధాని Delhiలో ఒక్క సిలిండర్ ధర రూ. 3,071.50కి చేరింది. పెంచిన ధర నేటి నుంచే అమల్లోకి రానుంది.

అయితే గృహ వినియోగదారులకు కొంత ఊరట లభించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. దీంతో గృహ వినియోగదారులపై అదనపు భారం పడలేదు.

LPG Price Hike | ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు యథాతథం

ఇదిలా ఉండగా విమానయాన రంగానికి సంబంధించిన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయ విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులపై భారం పడకుండా ఉండేందుకు ప్రభుత్వరంగ చమురు సంస్థలు ధరలను పెంచకుండా భరించేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ విషయాన్ని IndianOil వెల్లడించింది.

ఈ పరిణామాలతో వాణిజ్య రంగంపై ప్రభావం ఉండే అవకాశం ఉండగా, గృహ వినియోగదారులకు మాత్రం కొంత ఉపశమనం లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

TIMS Sanathnagar Trial | సమస్త వైద్య సేవల సమాహారం టిమ్స్​.. ఈ వైద్యాలయ ప్రత్యేకతలు ఎన్నో.. నేటి నుంచి ఓపీ!

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Padakal Palm Fire | ఈతవనంలో కార్చిచ్చు.. అగ్నికి ఆహుతైన 200 ఈత చెట్లు!

అక్షరటుడే ఆర్మూర్: Padakal Palm Fire | నిజామాబాద్​ జిల్లా జక్రాన్‌పల్లి...

May 01 Gold Rates | రోజు రోజుకి ప‌డిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లోనే భారీ పతనం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 01 Gold Rates | బంగారం, వెండి కొనుగోలుదారులకు...

TIMS Sanathnagar Trial | సమస్త వైద్య సేవల సమాహారం టిమ్స్​.. ఈ వైద్యాలయ ప్రత్యేకతలు ఎన్నో.. నేటి నుంచి ఓపీ!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: TIMS Sanathnagar Trial | హైదరాబాద్ మహా నగరంలో...