Padakal Palm Fire | ఈతవనంలో కార్చిచ్చు.. అగ్నికి ఆహుతైన 200 ఈత చెట్లు!

Naresh Chandan
Padakal Palm Fire

అక్షరటుడే ఆర్మూర్: Padakal Palm Fire | నిజామాబాద్​ జిల్లా జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామంలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈతవనంలో మంటలు వ్యాపించి, పచ్చని వనం కాలిబూడిదగా మారింది.

గ్రామ శివారులో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈతవనం మంటల్లో చిక్కుకుని దగ్ధమైంది. సుమారు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ వనంలో సుమారు 200కు పైగా ఈత చెట్లు పూర్తిగా కాలిబూడిదైనట్లు స్థానికులు తెలిపారు.

Padakal Palm Fire | కారణాలు ఏమిటి..?

అగ్ని ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఎండాకాలం తీవ్రత కారణంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఉండవచ్చని స్థానికులు భావిస్తుండగా.. మరికొందరు కావాలనే ఎవరో నిప్పు పెట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే భారీ నష్టం సంభవించింది.

ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టాల్సి ఉంది. రైతులు, గౌడ సంఘ సభ్యులు ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేసి, బాధితులకు ప్రభుత్వం తగిన పరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

TIMS Sanathnagar Trial | సమస్త వైద్య సేవల సమాహారం టిమ్స్​.. ఈ వైద్యాలయ ప్రత్యేకతలు ఎన్నో.. నేటి నుంచి ఓపీ!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *