Kerala teacher suicide | కామారెడ్డిలో కలకలం: పాఠశాల క్వార్టర్స్‌లో కేరళ ప్రైవేట్ టీచర్​ సూసైడ్

సాధారణంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కేరళకు చెందిన ఉపాధ్యాయులను ఇక్కడి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేకంగా రప్పించుకుంటూ ఉంటాయి.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Kerala teacher suicide | కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండల పరిధిలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఒక ప్రైవేట్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కేరళకు చెందిన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. స్కూలుకు సంబంధించిన క్వార్టర్స్ లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది.

Kerala teacher suicide | 10 రోజుల క్రితమే విధుల్లోకి..

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళ రాష్ట్రానికి చెందిన దేవిక విల్లా అనే ఉపాధ్యాయురాలు కామారెడ్డి పట్టణ సమీపంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో పాఠాలు బోధించేందుకు పది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చారు. నర్సన్నపల్లి గ్రామంలోని పాఠశాల క్వార్టర్స్‌కు సంబంధించిన ఒక ఇంట్లో ఆమె నివాసముంటున్నారు.

Kerala teacher suicide | ఉరేసుకుని బలవన్మరణం

దేవిక విల్లా బుధవారం సాయంత్రం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.

Hyderabad Water Crisis | ఐటీ హబ్‌ల తళతళల వెనుక ‘జల’ సంక్షోభం: భాగ్యనగరంలో పాతాళంలోకి భూగర్భ జలాలు!

పోలీసుల దర్యాప్తు

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH)కి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఆమె అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.

సాధారణంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కేరళకు చెందిన ఉపాధ్యాయులను ఇక్కడి ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేకంగా రప్పించుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే వచ్చిన సదరు ఉపాధ్యాయురాలు చేరిన కొద్దిరోజుల్లోనే ఇలా విగతజీవిగా మారడంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *