Nizamabad Medical College | వైద్య విద్యార్థులకు తీపికబురు.. ​నిజామాబాద్ మెడికల్​ కళాశాలలో యూజీ, పీజీ సీట్ల పెంపు..

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలకు అదనంగా 17 పీజీ వైద్య విద్య సీట్లకు అనుమతి వచ్చింది.

shashi kiran Mottala

​అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad Medical College | వైద్య విద్యార్థులకు గుడ్​ న్యూస్ ఇది..​ నిజామాబాద్​ మెడికల్​ కళాశాలకు (Nizamabad) నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) పరిధిలోని మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు (MARB) అదనంగా 17 పీజీ (PG) వైద్య విద్య సీట్లకు అనుమతి మంజూరు చేసింది. అలాగే గతంలో 2026–2027కు గాను ఎన్​ఎంసీ నుంచి 30 ఎంబీబీఎస్​ సీట్లను సైతం కేటాయించారు.

Nizamabad Medical College | నాలుగు విభాగాల్లో పీజీ సీట్లు..

నిజామాబాద్​ మెడికల్​ కళాశాలకు 17 అదనపు పీజీ సీట్లు నాలుగు విభాగాల్లో కేటాయించారు. ​కమ్యూనిటీ మెడిసిన్​లో  4 సీట్లు,  అనస్థీషియాలజీకి 6 సీట్లు, పాథాలజీకి 4 సీట్లు, ​ప్రసూతి, స్త్రీరోగ వైద్య విభాగంకు 3 సీట్లు కేటాయించారు. ​ఇప్పటికే కళాశాలలో 81 పీజీ సీట్లు ఉండగా, తాజాగా మంజూరైన 17 అదనపు సీట్లతో 2026–2027 విద్యా సంవత్సరానికి మొత్తం పీజీ సీట్ల సంఖ్య 98కి చేరింది.

Nizamabad Medical College | యూజీ సీట్ల పెంపుతో విద్యార్థులకు లాభం..

2026–2027 విద్యా సంవత్సరానికి గాను ఎన్​ఎంసీ యూజీ సీట్లను సైతం పెంచింది. గతంలో 120 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా మరో 30సీట్లు పెంచుతూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మొత్తంగా కళాశాలకు 150సీట్లు కేటాయించినట్లయ్యింది.

ఇది కూడా చదవండి: రోజుకి ఒక బకెట్.. పీజీ హాస్టల్​ హాస్టల్ యువతి ఆవేదన 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *