TG SAFE inspections | ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉక్కుపాదం.. రూ. 17 లక్షలకు పైగా కల్తీ ఆహార పదార్థాలు సీజ్, 13 హోటళ్లు, వ్యాపార సంస్థల లైసెన్సులు సస్పెండ్!

సరైన FSSAI లైసెన్సులు లేకుండా నడుస్తున్న మహారాజా స్వీట్ & బేక్స్ (మిర్చి కాంపౌండ్), పంచవటి స్వీట్స్ (దుబ్బ), శివ శక్తి ఐస్ క్రీమ్ (దుబ్బ), సాగర్ బేకరీ (ఆటోనగర్) ని తక్షణమే మూసివేయించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: TG SAFE inspections | రాష్ట్రంలో ఆహార భద్రత ప్రమాణాలను పక్కగా అమలు చేసేందుకు తెలంగాణ Telangana స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎన్సెన్షియల్ డ్రగ్స్ (TG SAFE) దూకుడు పెంచింది. ఇందులో భాగంగా నవంబర్ 3, 2026న నిజామాబాద్ జిల్లాలో విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు చెందిన 14 ప్రత్యేక బృందాలు, పోలీసు సిబ్బందితో కలిసి జిల్లా వ్యాప్తంగా మొత్తం 28 ఆహార సంబంధిత వ్యాపార సంస్థల్లో (స్పైసెస్ తయారీ యూనిట్లు, ప్యాకేేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు, స్వీట్ షాపులు, బేకరీలు, రెస్టారెంట్లు) ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు.

TG SAFE inspections | తీవ్ర ఉల్లంఘనలు

అధికారులు జరిపిన తనిఖీల్లో పలు షాపులు, రెస్టారెంట్లలో దారుణమైన పరిస్థితులు బయటపడ్డాయి. ప్రధానంగా గుర్తించిన లోపాలు ఇవే..

  • వంటగదులు అత్యంత అపరిశుభ్రంగా ఉండటం, దెబ్బతిన్న నేలలపై వ్యర్థాలు పేరుకుపోవడం.
  • గోడలపై నల్లటి మసి, గ్రీజు ఉండటం, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు, చిమ్నీలు మురికితో నిండిపోవడం.
  • బొద్దింకలు, ఈగలు, కీటకాలు, మూషికాల (ఎలుకల) బెడద విపరీతంగా ఉండటం, ఆహార పదార్థాలపై ఎలుకల మల విసర్జన గుర్తించడం.
  • కుళ్లిపోయిన, పాడైపోయిన కూరగాయలను వాడటం.
  • ఫ్రిజ్‌లలో ఉడికించిన, ఉడికించని పదార్థాలను ఎటువంటి లేబుల్స్ లేకుండా కలిపి ఉంచడం.
  • ఫుడ్ హ్యాండ్లర్స్ (వంట మనుషులు) గ్లౌజులు, హెయిర్‌నెట్లు ధరించకపోవడం.
  • గడువు ముగిసిన (Expired) ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం.
  • ఆహార పదార్థాలను కవర్ చేయడానికి వార్తాపత్రికలను (Newspapers) ఉపయోగించడం, లూజ్ పౌడర్ స్పైసెస్ విక్రయించడం.
  • ప్యాకేజ్డ్ వాటర్ యూనిట్లలో సరైన లేబొరేటరీ టెస్టింగ్ లేకపోవడం.

TG SAFE inspections | 26 నమూనాల సేకరణ

కల్తీపై అనుమానంతో మొత్తం 26 నమూనాలను (Samples) సేకరించి ల్యాబ్‌కు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 9,645 కిలోల ఆహార పదార్థాలను అధికారులు సీజ్ చేసి ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారు రూ. 17,28,495/- ఉంటుందని అంచనా.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

సరైన FSSAI లైసెన్సులు లేకుండా నడుస్తున్న మహారాజా స్వీట్ & బేక్స్ (మిర్చి కాంపౌండ్), పంచవటి స్వీట్స్ (దుబ్బ), శివ శక్తి ఐస్ క్రీమ్ (దుబ్బ), సాగర్ బేకరీ (ఆటోనగర్) ని తక్షణమే మూసివేయించారు.

TG SAFE inspections | 13 సంస్థల లైసెన్సులు సస్పెన్షన్

ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్.పి. ప్రొడక్ట్స్, జునైరా ఫ్యామిలీ రెస్టారెంట్, చప్పన్ భోగ్ స్వీట్స్, ఖురేషియా హోటల్, వాటర్ సొల్యూషన్ కంపెనీ, జనతా ట్రేడర్స్, ఐరా ఫుడ్స్ & బెవరేజెస్‌, సుఖ్‌జిత్ స్టార్చ్ మిల్స్, శ్రీ అయ్యప్ప ట్రేడర్స్, రాధే మిఠాయి వాటిక, శ్రీ రాధే ఎంటర్‌ప్రైజెస్, మొఘ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, క్వాలిటీ స్వీట్స్ & చిక్కి/కెకె స్వీట్స్ సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేస్తూ వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించారు.

నిబంధనలు ఉల్లంఘించిన మరో 12 సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, స్వల్ప లోపాలున్న మరో 3 సంస్థలకు ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, భవిష్యత్తులోనూ ఇటువంటి దాడులు కొనసాగుతాయని TG SAFE కమిషనర్ హెచ్చరించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *