Vempalli Lorry Accident | వేంపల్లి బైపాస్ వద్ద లారీ బోల్తా.. ఒకరు మృతి

ముప్కాల్​ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం లారీ బోల్తా ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ముప్కాల్: Vempalli Lorry Accident | మండలంలోని వేంపల్లి (Vempalli) గ్రామ శివారులోని బైపాస్ వద్ద మంగళవారం లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.

Vempalli Lorry Accident | ఆర్మూర్​ నుంచి నిర్మల్​ వైపు..

స్థానికుల కథనం ప్రకారం.. ఆర్మూర్ (Armoor) నుంచి నిర్మల్ వైపు సంత్రాల లోడుతో వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో అదుపుతప్పి బోల్తా పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆర్మూర్​ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి..: Kamareddy SP | అంతర్రాష్ట్ర గంజాయి నిందితుల అరెస్టు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *