Government Schemes | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి : మానాల మోహన్​ రెడ్డి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్​ రెడ్డి కార్యకర్తలకు సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కమ్మర్​పల్లి: Government Schemes | ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మన్ మానాల మోహన్​ రెడ్డి (Manala Mohan Reddy) పేర్కొన్నారు. రుద్రంగి మండలంలో ఆదివారం ఉమ్మడి మానాల గ్రామ కాంగ్రెస్​ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించగా.. రాష్ట్ర వెలమ కార్పొరేషన్ అధ్యక్షుడు జువడి నర్సింగ్ రావుతో కలిసి పాల్గొన్నారు.

Government Schemes | పథకాలను లబ్ధిదారులకు అందజేయాలి..

రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం (Indiramma Housing Scheme), గృహజ్యోతి, ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్ల బోనస్, రైతుబంధు, రైతు భరోసా, రూ.500కే గ్యాస్ సిలిండర్ అర్హులందరికీ రేషన్ కార్డులు (Ration Cards) అందిస్తోందన్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జలపతి, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ గంగ నర్సయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ తిరుపతి, లక్ష్మణ్ నాయక్, భీమ్​గల్​ మున్సిపల్ వైస్ ఛైర్మన్ జేజే నర్సయ్య, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు నారాయణ, వివిధ గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ఉప సర్పంచ్​లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

malanall

ఇది కూడా చదవండి: Oman Indian Vessel | ఒమన్ తీరంలో చిక్కుకున్న భారత నౌక.. 14 మంది సిబ్బంది క్షేమం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *