Midday Meal Menu | మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి..ఎమ్మెల్యే ధన్​పాల్​

మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Midday Meal Menu | నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని ఎమ్మెల్యే ధన్​పాల్​ (MLA Dhanpal) పేర్కొన్నారు. నగరంలోని మిర్చికాంపౌండ్​లో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను ఆయన బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Midday Meal Menu | రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

మిర్చికాంపౌండ్​లో రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం ఆయన అక్కడే ఉన్నప్రాథమిక ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ మెనూ ప్రకారం భోజనం వడ్డించట్లేదని గమనించిన ఆయన మిడ్​డే మిల్స్​ నిర్వాహకురాలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూకు తగ్గట్లుగా భోజనం ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందించాల్సిన బాధ్యత మధ్యాహ్న భోజన నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. పెండింగ్​ బిల్లుల విషయంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారు. కార్యక్రమంలో 34వ డివిజన్​ కార్పొరేటర్​ బంటు ప్రీతి ప్రవీణ్​, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మారెడ్డి వనిత, బీజేపీ నాయకులు సురేష్​ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Property Grabbing | తప్పుడు ఆరోపణలతో ఆస్తిని కాజేసే కుట్ర చేస్తున్నారు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *