Stock Market Losses | నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 403 పాయింట్ల, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Losses | దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market)లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతోంది. రెండు రోజుల ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో బెంచ్‌మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల బాటలో పయనిస్తున్నాయి. ఫార్మా, మీడియా, టెలికాం రంగాలు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. మెటల్, కన్జూమర్ డ్యూరెబుల్, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఆటో రంగాల ఇండెక్స్‌లు ఒక శాతానికిపైగా నష్టంతో ఉన్నాయి.

Stock Market Losses | నష్టాలతో ప్రారంభం..

సెన్సెక్స్ ఉదయం 156 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా అక్కడినుంచి కోలుకుని 202 పాయింట్లు పెరిగి లాభాల బాట పట్టింది. అయితే ఇంట్రాడే గరిష్టాల వద్ద ప్రాఫిట్ బుకింగ్‌తో 599 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 67 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 184 పాయింట్లు పడిపోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 403 పాయింట్ల నష్టంతో 82,128 వద్ద, నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 25,244 వద్ద ఉన్నాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 7 స్టాక్స్ లాభాలతో, 23 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. ట్రెంట్ 0.82 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.77 శాతం, సన్‌ఫార్మా 0.70 శాతం, ఎస్బీఐ 0.64 శాతం, మారుతి 0.53 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టైటాన్ 3.92 శాతం, టీసీఎల్ 1.96 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.79 శాతం, ఆసియన్ పెయింట్ 1.73 శాతం, ఎటర్నల్ 1.56 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి..: India Electronics Market | 2030 నాటికి రూ. 10 లక్షల కోట్లకు చేరనున్న భారత ఎలక్ట్రానిక్స్ మార్కెట్: క్రోమా – కెర్నీ నివేదిక వెల్లడి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *