Rice Mill Action | నిబంధనలు ఉల్లంఘించిన రైస్​మిల్లులపై చర్యలు తప్పవు: సీపీ సాయిచైతన్య

జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన రైస్​మిల్లులపై చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం : Rice Mill Action | జిల్లాలో(Nizamabad) నిబంధనలు ఉల్లంఘించిన రైస్​మిల్లులపై చర్యలు తప్పవని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంఆర్ రైస్​మిల్లులలో చోటు చేసుకున్న అవకతవకలపై సివిల్​ సప్లయ్​ అధికారులతో సమీక్షించారు.

Rice Mill Action | సీఎంఆర్​ అవకతవకలపై..

జిల్లాలో నమోదైన కేసుల దర్యాప్తు పురోగతి, స్వాధీనం చేసుకున్న ధాన్యం, బియ్యం, సంబంధిత రికార్డులను సీపీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితులపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యలు, మిగిలిన కేసుల విచారణ వేగవంతం చేయడం తదితర అంశాలపై పోలీస్ కమిషనర్ విచారణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..సీఎంఆర్ ధాన్యంలో పారదర్శకతను పాటించాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సివిల్ సప్లై శాఖ, పోలీసు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

Rice Mill Action | పునరావృతం కాకుండా..

భవిష్యత్తులో ఇటువంటి అవకతవకలు పునరావృతం కాకుండా నిరంతర తనిఖీలు నిర్వహించి, నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, జిల్లా సివిల్ సప్లయ్​ అధికారి శ్రీకాంత్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, మల్లేష్, సీసీఆర్పీ ఇన్​స్పెక్టర్​ ఆర్. అంజయ్య, జిల్లా సివిల్ సప్లయ్​ కార్పొరేషన్ మేనేజర్ ప్రవీణ్, జిల్లా అసిస్టెంట్ సివిల్ సప్లయ్​ కార్పొరేషన్ మేనేజర్ అరవింద్ రెడ్డి,  రైస్​మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దయానంద్ గుప్తా, రాష్ట్ర రైస్​మిల్ అసోసియేషన్ సెక్రెటరీ వడ్డీ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *