అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Property Grabbing | కోర్టు తీర్పులను సైతం ధిక్కరిస్తూ, తప్పుడు ఆరోపణలతో నాకున్న ఆస్తిని కాజేసే కుట్ర పన్నుతున్నారని జిల్లా (Nizamabad) కేంద్రానికి చెందిన మంద జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
Property Grabbing | సమీప బంధువే కుట్ర..
తమ సమీప బంధువైన మంద స్వరూప తమ ఆస్తిపైన కన్నేసి స్వాధీనం చేసుకునే కుట్ర చేస్తుందని ఆరోపించారు. తనకున్న ఆస్తులపై కోర్టులో సైతం కేసులు వేసిందని, ఆ కేసులలో తనకు అనుకూలంగా తీర్పు రావడంతో జీర్ణించుకోలేక పసలేని ఆరోపణలు గుప్పిస్తూ తన అంతు చూస్తానని బెదిరిస్తుందని అన్నారు. వేధిస్తున్నానంటూ పోలీస్ స్టేషన్లో సైతం అకారణంగా కేసులు పెడుతూ తనను తీవ్ర మనోవేదనకు గురి చేస్తోందని పేర్కొన్నారు. ఆ తప్పుడు కేసులపైన పోలీసులు విచారించి అందులోనూ తనను నిర్దోషిగా తేల్చారని అన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని జిల్లాకలెక్టర్, పోలీస్ కమిషనర్లకు వేడుకుంటున్నానన్నారు.
ఇది కూడా చదవండి..: Cheyutha pensions | పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. అర్హులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్