Cheyutha pensions | పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా.. అర్హులకు చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Cheyutha pensions | సమాజంలోని పేద, బలహీన వర్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించి, వారికి అండగా నిలవడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పష్టం చేశారు.

కామారెడ్డి Kamareddy జిల్లా సదాశివనగర్​లోని అశోక్ గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాలను లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు.

Cheyutha pensions | మండలాల వారీగా..

ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన అర్హులైన పేదలకు భారీ సంఖ్యలో ఈ పింఛన్లు మంజూరయ్యాయి. మొత్తం 2,041 మందికి పెన్షన్ మంజూరు పత్రాలను అందించారు.
గాంధారి మండలంలో 717 మంది, సదాశివనగర్ మండలంలో 475 మంది, తాడ్వాయి మండలంలో 407 మంది, రామారెడ్డి మండలంలో 223 మంది, రాజంపేట మండలంలో 219 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.

Cheyutha pensions | అభివృద్ధితో పాటు సంక్షేమానికి సమప్రాధాన్యం

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పేద కుటుంబాల సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తామని, లబ్ధిదారులు ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పెన్షన్ మంజూరు పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *