Kishore Movie Makers | ‘కిషోర్ మూవీ మేకర్స్’ తొలి చిత్రం ప్రారంభం.. హీరోగా విజయ్ రాజ్ కుమార్, కథానాయికగా ‘KGF’ తల్లి అర్చనా జోయస్!

డైరెక్టర్ రవికుమార్ చౌదరి, సీనియర్ రచయిత ఘటికాచలం వద్ద రచయితగా, అసోసియేట్ దర్శకుడిగా సుదీర్ఘ అనుభవం గడించిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kishore Movie Makers | తెలుగు చిత్రసీమలోకి మరో కొత్త నిర్మాణ సంస్థ అడుగుపెట్టింది. ‘కిషోర్ మూవీ మేకర్స్’ బ్యానర్‌పై నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ నిర్మిస్తున్న ‘ప్రొడక్షన్ నంబర్ 1’ చిత్రం బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రసిద్ధ రామానాయుడు స్టూడియోస్‌లో వైభవంగా ప్రారంభమైంది.

సినీ ప్రముఖులు, అనేకమంది అతిథుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్, ప్రముఖ నటుడు ఆది సాయికుమార్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.

Kishore Movie Makers | నూతన దర్శకుడిగా దివాకర్ యడ్ల

స్టార్ డైరెక్టర్ రవికుమార్ చౌదరి, సీనియర్ రచయిత ఘటికాచలం వద్ద రచయితగా, అసోసియేట్ దర్శకుడిగా సుదీర్ఘ అనుభవం గడించిన దివాకర్ యడ్ల ఈ చిత్రంతో మెగాఫోన్ పట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఇక ‘డెలులు’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్న విజయ్ రాజ్ కుమార్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తుండగా, ‘కేజీఎఫ్’ (KGF) సంచలన చిత్రంలో యశ్ తల్లి పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అర్చనా జోయస్ కథానాయికగా నటిస్తున్నారు. అలాగే ‘అర్జున్ రెడ్డి’, ‘అమీతుమీ’ చిత్రాలతో మెప్పించిన నటి అతిథి మ్యూకల్ ఈ సినిమాలో ఒక ప్రాధాన్యత ఉన్న కీలక పాత్రలో కనిపించనున్నారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Kishore Movie Makers | ప్రేక్షకులను రీ-కనెక్ట్ చేసే కథ

ఈ సందర్భంగా దర్శకుడు దివాకర్ యడ్ల మాట్లాడుతూ – “ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో జరిగిన మధురమైన జ్ఞాపకాలను, మర్చిపోలేని క్షణాలను కచ్చితంగా గుర్తుచేసుకుంటారు.

ఈ చిత్రానికి కథే అసలైన హీరో. హైదరాబాద్, కేరళలోని ప్రకృతి రమణీయమైన ప్రదేశాల్లో షూటింగ్ ప్లాన్ చేశాం. నా కథను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత ఎన్.ఎన్. కిషోర్ గారికి, నటీనటులకు, టెక్నీషియన్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని తెలిపారు.

Kishore Movie Makers | తెలుగు సినిమాతో వస్తుండటం చాలా హ్యాపీ

హీరోయిన్ అర్చనా జోయస్ మాట్లాడుతూ – “కన్నడలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించినప్పటికీ, ‘కేజీఎఫ్’ సినిమా నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ద్వారా నేరుగా తెలుగు సినిమాలో కథానాయికగా నటిస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది. ఒక మంచి ప్రతిభావంతమైన టీమ్‌తో పనిచేస్తుండటం ఆనందాన్ని ఇస్తోంది” అని చెప్పుకొచ్చారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *