Indiramma Houses | ఇందిరమ్మ ఇళ్లలో ‘దీపావళి’ కార్యక్రమం : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్లలో "మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి" కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Indiramma Houses | గృహ ప్రవేశం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లలో “మా ఇందిర‌మ్మ ఇంట్లో దీపావ‌ళి” కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti) తెలిపారు. దీపావ‌ళి రోజు ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, క‌లెక్ట‌ర్లు, గృహ నిర్మాణ శాఖ అధికారులు లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్​లో బుధవారం మంత్రి పొంగులేటి ఉమ్మడి రంగారెడ్డి (Rangareddy) జిల్లాలోని భూ సర్వే, రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, హౌసింగ్ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. తొలివిడ‌త మంజూరు చేసిన 4.50 ల‌క్ష‌ల ఇళ్లలో ఇప్ప‌టికి 2,21,500 గృహప్ర‌వేశాలు పూర్త‌య్యాయని తెలిపారు. దీపావళి పండుగ రోజు ఆయా ఇళ్లలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దీనిని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ఇల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందిస్తామని స్పష్టం చేశారు.

Indiramma Houses | పకడ్బందీగా రీసర్వే

భూముల రీస‌ర్వే రైతుల సమక్షంలోనే చేపట్టాలని మంత్రి ఆదేశించారు. రీస‌ర్వే జ‌రిగే గ్రామాల్లో ప్ర‌తిరోజు తహ‌శీల్దార్లు ప‌ర్య‌టించాలని, ఆర్డీవో, అద‌న‌పు క‌లెక్ట‌ర్లు, క‌లెక్ట‌ర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సరిహద్దు వివాదాలు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలు, భూముల హద్దులపై నెలకొన్న వివాదాలు వంటి అంశాలను కూడా సమగ్ర సర్వే ద్వారా పరిష్కరించాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Water Tanker Strike | వాటర్​ ట్యాంకర్​ యజమానుల సమ్మె విరమణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *