Chain Snatching Gang | వాంతులు చేసుకున్నట్లు నటించి.. చైన్​ స్నాచింగ్​కు పాల్పడుతున్న ముఠా

ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్​ స్నాచింగ్​కు పాల్పడుతున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్​ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chain Snatching Gang | ఒంటరి మహిళలు, వృద్ధులను లక్ష్యంగా చేసుకొని చైన్​ స్నాచింగ్​కు పాల్పడుతున్న ముఠా గుట్టును ఆదిలాబాద్​ పోలీసులు (Adilabd Police) రట్టు చేశారు. ఈ ముఠాలోని మహిళలు వాంతులు చేసుకున్నట్లు నటించి, మహిళల మెడలోని ఆభరణాలను మాయం చేస్తారు.

మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు కలిసి ఒక గ్యాంగ్​గా ఏర్పడ్డారు. వీరు కారు, ఆటోలో ప్రయాణిస్తూ.. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. ఒంటరిగా వెళ్తున్న మహిళలను ఆటోలో ఎక్కించుకుంటారు. అందులో మిగతా వారు అందరు ముఠా సభ్యులు ఉంటారు. అనంతరం ముఠాలోని ఓ మహిళా వాంతులు చేసుకున్నట్లు నటిస్తుంది. దీంతో బాధితులు దృష్టి మరల్చగానే మరో మహిళ ఆమె మెడలోని ఆభరణాలను మాయం చేస్తోంది. అనంతరం బాధితులను దింపేసి వెళ్తారు. ఈ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలు వెల్లడించారు.

Chain Snatching Gang | నాలుగు రాష్ట్రాల్లో..

వారం రోజుల ముందు ఈ ముఠా ఆదిలాబాద్ పట్టణంలో ఒక మహిళను ఆటోలో ఎక్కించుకుని, ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందితులను పట్టుకున్నారు. విచారణలో నిందితులు ఆదిలాబాద్​, నిర్మల్​ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో సైతం నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. వారి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు, ఒక కారు, ఒక ఆటోరిక్షా స్వాధీనం చేసుకున్నారు.

దీనిని కూడా చదవండి : SI Caught by ACB | రూ.40 వేల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *