Raptadu school attack case | రాప్తాడు పాఠశాల దాడి కేసులో సంచలనం.. నిందితుడు హేమంత్‌పై పోలీసుల ఎదురుకాల్పులు!

ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు హేమంత్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Raptadu school attack case | ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై చెట్లు నరికే ఎలక్ట్రిక్ రంపంతో అత్యంత కిరాతకంగా జరిగిన దాడి కేసు ఊహించని మలుపు తిరిగింది. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులపైనే అతడు తిరగబడటంతో పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపారు.

ఈ ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Raptadu school attack case | పాఠశాల గదిలోనే అమానుష దాడి!

రాప్తాడు జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గోపిక అనే విద్యార్థినిపై నిందితుడు హేమంత్ శనివారం అత్యంత అమానుషంగా ప్రవర్తించాడు. పాఠశాల గదిలోకి చొరబడిన హేమంత్, తనతో తెచ్చుకున్న ఎలక్ట్రిక్ రంపంతో (వుడ్ కటింగ్ మెషిన్) గోపికపై దాడికి తెగబడ్డాడు.

హేమంత్ చేస్తున్న దాడి నుంచి గోపికను కాపాడే ప్రయత్నంలో సహచర విద్యార్థిని లక్ష్మికి కూడా గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై ప్రాణపాయ స్థితిలో ఉన్న గోపికను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర చికిత్స పొందుతోంది.

Raptadu school attack case | అటవీ ప్రాంతంలో రాళ్లతో దాడి!

ఈ దారుణానికి ఒడిగట్టిన అనంతరం నిందితుడు హేమంత్ అక్కడ నుంచి పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

అనంతపురం జిల్లా ఆత్మకూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో హేమంత్ దాక్కున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. నిందితుడిని పట్టుకునేందుకు అడవిలోకి వెళ్లిన పోలీసులను చూసి హేమంత్ లొంగిపోకుండా, వారిపై రాళ్లతో విచక్షణారహితంగా దాడికి దిగి పారిపోయే ప్రయత్నం చేశాడు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Raptadu school attack case | 6 రౌండ్లు కాల్పులు..

పోలీసులపై దాడికి తెగబడి పారిపోతున్న నిందితుడిని నిరోధించే క్రమంలో పోలీసులు ఆత్మరక్షణార్థం హేమంత్‌పై 6 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలిపారు. బుల్లెట్లు తగలడంతో తీవ్రంగా గాయపడి కిందపడిపోయిన హేమంత్‌ను పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకుని, అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన ఈ క్రూరమైన దాడి, ఆ తర్వాతి పోలీసు కాల్పుల ఘటనతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం నెలకొంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *