అక్షరటుడే, మంగళగిరి: TDP Working President | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయ యవనికపై తెలుగుదేశం పార్టీ తన కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం అత్యంత ఘనంగా జరిగింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నూతన కార్యవర్గంతో ప్రమాణం చేయించారు.
TDP Working President | లోకేశ్‌కు కీలక బాధ్యతలు..
ఈ వేడుకలో అత్యంత కీలకమైన ఘట్టం.. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించడం. సీనియర్ల అనుభవం, యువత ఉత్సాహాన్ని మేళవిస్తూ చంద్రబాబు ఈసారి కమిటీలను రూపొందించారు. పొలిట్ బ్యూరోతో పాటు జాతీయ , రాష్ట్ర కమిటీల సభ్యులంతా ఈ కార్యక్రమంలో ప్రమాణం చేశారు.
Andhra Pradesh Minister Nara Lokesh sworn in as TDP national working president at NTR Bhavan, Mangalagiri, on Wednesday. His father and Chief Minister N. Chandrababu Naidu administered the oath to him and the new executive committee. pic.twitter.com/Kjxb8cgHfb
— The Hindu – Andhra Pradesh (@THAndhra) April 29, 2026
ఇది కూడా చదవండి..: Telugu Desam Party | పసుపు జెండా పౌరుషం తగ్గదు.. కార్యకర్తే ఈ పార్టీకి అధినేత : చంద్రబాబు

