అక్షరటుడే, వెబ్డెస్క్ : Drug Seizures | ఏపీ పోలీసులు (AP Police), ఈగల్ పోర్స్ అధికారులు గంజాయిపై ఉక్కుపాదం మోపారు. నాలుగు రోజులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్లో భాగంగా పోలీసులు మూడు ప్రధాన ఆపరేషన్లు నిర్వహించారు. బెంగళూరు నుంచి రైలులో ఎండీఎంఏ తరలిస్తున్న విద్యార్థినిని విజవాయడలో అరెస్ట్ చేశారు. ఆమె నుంచి రూ.11 లక్షల విలువైన 110 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని యర్రమ్శెట్టి నాగ సౌమ్యను అరెస్టు చేశారు. ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసిన హ్యాండ్లర్ షేక్ బషీర్ను అదుపులోకి తీసుకున్నారు. కర్నూల్ జిల్లా ఆమకతడు వద్ద రూ.2 లక్షల విలువైన 20 గ్రాముల ఎండీఎంఏను తరలిస్తున్న హ్యుండాయ్ వెర్నా వాహనాన్ని పోలీసులు అడ్డగించి, నల్లూరి వరుణ్ తేజను అరెస్టు చేశారు.
Drug Seizures | రెండు ఎకరాల్లో గంజాయి సాగు
నెల్లూరు జిల్లా దత్తలూరులో ఓ వ్యక్తి ఏకంగా రెండు ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నాడు. ఇప్పటికే 11 కేసులు ఉన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తుండగా.. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గంజాయి మొక్కలు ధ్వంసం చేశారు. విశాఖపట్నం తుర్లవాడ టోల్ ప్లాజా వద్ద రూ.1.9 కోట్ల విలువైన 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మచ్కుండ్ ఏజెన్సీ నుంచి మహారాష్ట్రలోని షిర్డీకి తరలిస్తున్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి..: Punganur Stone Attack | ఎంపీ కారుపై రాళ్ల దాడి.. పుంగనూరులో ఉద్రిక్తత