Arnab Cyclone | అర్నబ్​ తుపాన్​ బీభత్సం

బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్​ తుపాన్​ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Arnab Cyclone | బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్​ తుపాన్​ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. నరసాపురం సమీపంలో తీరంలోకి ప్రవేశించింది. నేడు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో తీరాన్ని దాటనుంది. ఆ సమయంలో అతి తీవ్ర తుపాన్​ మారనుందని అధికారులు హెచ్చరించారు.

తుపాన్​ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈదురుగాలులకు అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఎడతెరిపి లేని వానలు, గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మధ్యాహ్నం తర్వాత తుఫాన్ తీవ్రత తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. అధికారులు కోస్తాంధ్ర అంతటా రెడ్ అలర్ట్ జారీ చేశారు.

Arnab Cyclone | తెలంగాణలో..

తుపాన్​ ప్రభావం నేడు తెలంగాణ (Telangana)పై ఉండనుంది. ఉదయం నుంచే వాతావరణం మేఘావృతమై ఉంటుంది. భారీగా గాలులు వీస్తాయి. రానున్న 24 గంటల్లో ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, మంచిర్యాలు, పెద్దపల్లి, భూపాలపల్లి,నల్గొండ, యాదాద్రి , జనగాం, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతాయి.

ఇది కూడా చదవండి..: CI Caught by ACB | కేసు క్లోజ్​ చేయడానికి రూ.6 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన సీఐ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *