అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CI Caught by ACB | రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు భారీగా లంచాలు తీసుకుంటున్నారు. పనుల కోసం వచ్చే వారి నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. పైసలు ఇస్తేనే పనులు చేస్తున్నారు.
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఓ సీఐ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఓ వ్యక్తిపై నమోదైన కేసును క్లోజ్ చేయడానికి ఏకంగా రూ.6 లక్షల లంచం అడిగాడు. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ కొండల్ రావును ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ వ్యక్తిపై నమోదైన కేసును మూసివేయడం, చర్యలు తీసుకోకుండా ఉండటంతో పాటు, ఇతర సహాయం చేయడానికి సీఐ రూ.6 లక్షల లంచం అడిగాడు. దీంతో బాధితుడు కుమారుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
CI Caught by ACB | హోమ్‌గార్డు ద్వారా..
సీఐ కొండల్రావు హోమ్‌గార్డ్ ద్వారా లంచం తీసుకున్నాడు. మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్లో పని చేసే హోంగార్డు అబిద్ అలీ ద్వారా రూ.3 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి సీఐతో పాటు హోంగార్డును అరెస్ట్ చేశారు. ఇటీవల పోలీసులు ఏసీబీకి చిక్కుతుండటం శాఖకు మచ్చ తెస్తోంది. ఎక్కువగా ఎస్సైలు, సీఐలు లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు. అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇది కూడా చదవండి..: Drought Mandals | కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం