Drought Mandals | కరువు మండలాలు ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ వ్యాప్తంగా 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Drought Mandals | ఎల్​నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు తాండవం చేస్తోంది. జలాశయాల్లో నీటి మట్టం వేగంగా పడిపోతుంది. భూగర్భ జలాలు సైతం అడుగంటుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది.

Drought Mandals | రూ.20 వేల కోట్లు ఇవ్వాలి

తెలంగాణ వ్యాప్తంగా 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మండలాల్లో తాగునీటి సరఫరాతో పాటు.. పశుగ్రాసం, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొంది. కరువు నేపథ్యంలో రూ.20వేల కోట్ల ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజ్ అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

దీనిని కూడా చదవండి : Double Bedroom Houses | డబుల్ బెడ్​ రూమ్​ ఇళ్లపై మంత్రి గుడ్​ న్యూస్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *