Uppal Police Case | ప్రేమను నిరాకరించిందని యువతికి బెదిరింపులు.. యువకుడిపై కేసు నమోదు!

అతడిని తల్లిదండ్రులు హెచ్చరించినప్పటికీ వేధింపులు ఆగలేదని, తరచూ ఫోన్‌ కాల్స్‌, సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని యువతి ఆరోపించింది.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Uppal Police Case | ప్రేమను తిరస్కరించిందనే కారణంతో ఓ యువతిని వేధిస్తూ, ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ బెదిరించిన యువకుడిపై హైదరాబాద్​ ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Uppal Police Case | స్నేహితురాలి ద్వారా పరిచయం..

పోలీసుల వివరాల ప్రకారం.. రామంతపూర్‌లోని వెంకటరెడ్డినగర్‌కు చెందిన 20 ఏళ్ల డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థినికి ఖైరతాబాద్‌కు చెందిన అలెక్స్‌ (26) 2024 జులైలో ఆమె స్నేహితురాలి ద్వారా పరిచయమయ్యాడు. కొంతకాలం తర్వాత 2025 డిసెంబర్‌లో అలెక్స్‌ తన ప్రేమను వ్యక్తం చేయగా, యువతి అంగీకరించలేదు. అనంతరం అతడితో మాట్లాడటం మానేసింది.

TGSRTC Metro Common Pass | హైదరాబాద్ వాసులకు టీజీఎస్ఆర్టీసీ బంపర్​ ఆఫర్.. ఒకే పాస్‌తో బస్సు, మెట్రో ప్రయాణం!

Uppal Police Case | అలెక్స్​ బెదిరింపులు..

అయితే యువతి తనను దూరంగా పెట్టినప్పటికీ అలెక్స్‌ వెంటపడుతూ, తనతో మాట్లాడాలని ఒత్తిడి చేసేవాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తన మాట వినకపోతే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించినట్లు తెలిపింది.

ఈ ఏడాది మేలో యువతితో కలిసి ఉన్న కొన్ని ఫొటోలను ఆమె తల్లి వాట్సాప్‌ నంబర్‌కు అలెక్స్‌ పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తల్లిదండ్రులు అతడిని హెచ్చరించినప్పటికీ వేధింపులు ఆగలేదని, తరచూ ఫోన్‌ కాల్స్‌, సందేశాలు పంపుతూ ఇబ్బందులకు గురిచేశాడని యువతి ఆరోపించింది.

బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *