Travel Bus Fire | ట్రావెల్స్​ బస్సు దగ్ధం.. తప్పిన ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కాలిపోయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Travel Bus Fire | ప్రకాశం జిల్లా (Prakasam District) వలేటివారిపాలెం మండలం చుండి గ్రామం సమీపంలో సోమవారం అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

కడప నుంచి విజయవాడకు వెళ్తున్న ఈ బస్సులో అర్ధరాత్రి 1:30 గంటల సమయంలో ముందు టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కకు నిలిపి, ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు దించారు. ఆ సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. అదృష్టవశాత్తూ, మంటలు బస్సు మొత్తానికి వ్యాపించేలోపే ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Travel Bus Fire | పూర్తి కాలిపోయిన బస్సు

ప్రయాణికులు దిగిపోయిన అనంతరం మంటలు బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పి వేశారు. ఈ ప్రమాదంలో నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: Sana Satish Babu | ఉమ్మడి తూర్పుగోదావరిలో సానా మార్క్.. కూటమి క్లీన్ స్వీప్‌కు సాన పెట్టిన సతీష్ బాబు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *