అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ratnadeep Retail IPO | హైదరాబాద్ (Hyderabad)కు చెందిన రత్నదీప్ రిటెయిల్ లిమిటెడ్ ఆహారం, కిరాణా, వాల్యూ ఫ్యాషన్‌పై దృష్టి సారించి ఒక వ్యవస్థీకృత రిటైల్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో 190 కిపైగా స్టోర్లను కలిగి ఉంది. రత్నదీప్ (సూపర్ మార్కెట్లు), రత్నదీప్ సెలెక్ట్ (ప్రీమియం ఫుడ్ స్టోర్లు), నేషనల్ మార్ట్ (హైపర్ మార్కెట్), స్టైల్ మార్ట్ (సరసమైన ధరల్లో ష్యాషన్ ఉత్పత్తులు) పేర్లతో వీటిని నిర్వహిస్తోంది.
Ratnadeep Retail IPO | విస్తరణ కోసం..
రత్నదీప్ రిటెయిల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ప్రైమరీ మార్కెట్‌నుంచి నిధులు సమీకరించేందుకోసం ఈ కంపెనీకి సెబీ అనుమతించింది. డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఈ కంపెనీ తాజా షేర్ల జారీ ద్వారా రూ.400 కోట్లు సమీకరించనుంది. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు సందీప్ అగర్వాల్, మనీశ్ భార్తియా, మితేశ్ భార్తియా, యాస్ అగర్వాల్, కవితా అగర్వాల్ తమ వాటా షేర్లలో కొంతమేర (1.49 కోట్ల షేర్లు) విక్రయించనున్నారు. ప్రీ ఐపీవో ద్వారా రూ.70 కోట్ల విలువైన షేర్లను కంపెనీ జారీ చేసే అవకాశం ఉంది. ఫ్రెష్ ఇష్యూ ద్వారా వచ్చే ఆదాయంలోంచి రూ.40 కోట్లను కంపెనీ తీసుకున్న రుణాల చెల్లింపు కోసం, రూ,260 కోట్లను కొత్త స్టోర్లను ఏర్పాటు చేయడానికి, మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో తేదీలు, ప్రైస్ బ్యాండ్ ఖరారు కావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి..: Balipadyami Stock Market | నేడు బలిపాడ్యమి.. స్టాక్ మార్కెట్లకు సెలవు