Digi Yatra international trials | అంతర్జాతీయ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. 7 ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో డిజి యాత్ర ట్రయల్స్ ప్రారంభం!

ఈ-పాస్‌పోర్ట్ (e-Passport) కలిగి ఉన్న భారతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల్లో ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Digi Yatra international trials | దేశంలో విమాన ప్రయాణాలను మరింత సులభతరం చేసే దిశగా కేంద్ర పౌర విమానయాన శాఖ మరొక కీలక ముందడుగు వేసింది.

ఇప్పటివరకు కేవలం దేశీయ (Domestic) ప్రయాణాలకే పరిమితమైన ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ‘డిజి యాత్ర’ (Digi Yatra) సేవలను, ఇప్పుడు అంతర్జాతీయ (International) విమాన ప్రయాణికులకు కూడా అందించేందుకు ప్రయోగాత్మకంగా (Trials) శ్రీకారం చుట్టింది. ఈ నూతన విధానం వల్ల చెక్-ఇన్, సెక్యూరిటీ చెకింగ్స్ వద్ద క్యూలైన్ల సమస్య తగ్గి, ప్రయాణికులకు సమయం ఆదా కానుంది.

Digi Yatra international trials | హైదరాబాద్ సహా 7 ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో సేవలు!

ఈ ప్రతిష్ఠాత్మక పైలట్ ప్రాజెక్ట్‌ను దేశంలోని ఏడు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ Hyderabad (రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్), ఢిల్లీ, ముంబై, బెంగళూరులతో పాటు మరో మూడు ప్రధాన విమానాశ్రయాల్లో ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఈ-పాస్‌పోర్ట్ (e-Passport) కలిగి ఉన్న భారతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఎయిర్ ఇండియా (Air India), ఇండిగో (IndiGo) విమాన సర్వీసుల్లో ఈ సేవలను వినియోగించుకోవచ్చు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Digi Yatra international trials | 2027 నాటికి దేశవ్యాప్తంగా అమల్లోకి!

విమానాశ్రయాల్లో కాగిత రహిత (Paperless), బయోమెట్రిక్ ఆధారిత ప్రయాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ట్రయల్స్ విజయవంతమైతే.. 2027 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డిజి యాత్ర సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిజి యాత్ర రాకతో బోర్డింగ్ పాస్‌లు, ఫిజికల్ పాస్‌పోర్ట్‌ల తనిఖీకి పట్టే సమయం తగ్గి, విదేశీ ప్రయాణం మరింత వేగవంతంగా మారనుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *