India Bypolls 2026 | దేశవ్యాప్తంగా 6 స్థానాలకు ఉపఎన్నికలు.. తమిళనాడు, బెంగాల్‌లో తీవ్ర ఉత్కంఠ

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: India Bypolls 2026 | దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఖాళీ అయిన ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక లోక్‌సభ స్థానానికి ఉపఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమిళనాడులోని  ( Tamil Nadu )మదురాంతకం, ధారాపురం, పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్, పుదుచ్చేరిలోని తట్టాంచావడి అసెంబ్లీ స్థానాలతో పాటు, అసోంలోని నాగావ్ లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతోంది. గత సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రజాప్రతినిధులు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలవడం వల్ల ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం ఈ బైపోల్స్ నిర్వహిస్తోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.

India Bypolls 2026 | తొలి అగ్నిపరీక్ష..

తమిళనాడు ఉపఎన్నికల ప్రచారం అత్యంత వాడీవేడీగా సాగింది. మదురాంతకం, ధారాపురం స్థానాల నుంచి ఏఐఏడీఎంకే తరఫున గెలిచిన మాజీ ఎమ్మెల్యేలు కే. మరకతం కుమారవేల్, పి. సత్యభామ గెలిచిన కొద్ది రోజులకే తమ పదవులకు రాజీనామా చేసి విజయ్ స్థాపించిన ‘టీవీకే’ (TVK) పార్టీలో చేరారు. ఇప్పుడు తిరిగి అదే స్థానాల నుంచి టీవీకే అభ్యర్థులుగా బరిలోకి దిగారు. విజయ్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కావడంతో, పార్టీ ఫిరాయించి తమ వెంట వచ్చిన నేతలను గెలిపించుకోవడం ఆయనకు అత్యంత కీలకంగా మారింది. ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి విజయ్ వర్సెస్ డీఎంకే చీఫ్ స్టాలిన్ మధ్య మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

India Bypolls 2026 | బెంగాల్‌లోనూ వేడెక్కిన రాజకీయం..

పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్, రేజినగర్ ఉపఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన సువేందు అధికారి భవానీపూర్ స్థానాన్ని కంటిన్యూ అవుతూ, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత జరుగుతున్న తొలి ఉపఎన్నిక కావడంతో పాటు, తాను ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో ఈ ఎన్నిక నందిగ్రామ్‌లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి: Bird Flu in Anantapur | బర్డ్ ఫ్లూ కలకలం.. 2,500 కోళ్లు మృతి

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *