అక్షరటుడే, కామారెడ్డి: Student Suicide Kamareddy |ఎంత చదివినా బుర్రకెక్కడం లేదని.. చదువులో వెనుకంజలో ఉంటుండడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పాల్వంచ(palwancha) మండలంలో చోటు చేసుకుంది.
Student Suicide Kamareddy | తొమ్మిదో తరగతి విద్యార్థి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన దొరబోయిన జశ్వంత్ (15) గ్రామంలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే ఎంత చదివినా అతనికి చదువు అబ్బడం లేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. ఈ విషయంలో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోపలి గదిలో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి : #MaheshBabu పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులకు మంచి సర్ప్రైజ్ వచ్చింది. #Varanasi మూవీకి సంబంధించిన మహేష్ బాబు గ్లిప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.