SI Caught by ACB | రూ.40 వేల లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై

ఆదిలాబాద్ జిల్లా బజరహత్‌నూర్ సబ్​ ఇన్​స్పెక్టర్ జి రమేశ్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Caught by ACB | రాష్ట్రంలో రోజురోజుకు అవినీతి పెరిగి పోతోంది. ఏసీబీ (ACB) కేసులు నమోదు చేస్తున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.

ఆదిలాబాద్ (Adilabad) జిల్లా బజరహత్‌నూర్ సబ్​ ఇన్​స్పెక్టర్ జి రమేశ్​ ఓ వ్యక్తి నుంచి రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు. స్టేషన్​ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో అతడిని ఇరికించకుండా ఉండటానికి, పోలీసులు స్వాధీనం చేసుకున్న అతడి ఫోన్​ను తిరిగి ఇవ్వడానికి రూ.50 వేలు అడిగాడు. అనంతరం ఆ మొత్తాన్ని రూ.40 వేలకు తగ్గించాడు.

SI Caught by ACB | మహిళ ఫోన్​ చేయడంతో..

సదరు మహిళ ఆత్మహత్యకు ముందు ఆ వ్యక్తికి ఫోన్​ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని ఎస్సై రమేశ్​ కేసులో ఇరికిస్తానని బెదిరించి, లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. అయితే ఎస్సై నేరుగా లంచం తీసుకోలేదు. గ్రామ శివార్లలో నిర్మాణంలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో సెట్రింగ్​ బాక్సుల కింద రూ.40 వేలు ఉంచమని ఫిర్యాదుదారుడిని ఆదేశించాడు. అతడు అలాగే చేశాడు. అనంతరం ఆ మొత్తాన్ని ఎస్సై వచ్చి తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఎస్సైపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

దీనిని కూడా చదవండి : Indian Stock Market | ఐదో రోజూ లాభాల్లోనే..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.