అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahesh Goud Warning | కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. దానిని దుర్వినియోగం చేస్తూ.. హద్దులు దాటి మాట్లాడితే ఉపేక్షించమని హెచ్చరించారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన పీఏసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజాపాలన ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
మెదక్‌లోని వినాయక ఫంక్షన్ హాల్లో ఉమ్మడి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పీసీసీ చీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి దామోదర్ రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి,ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, డీసీసీ అధ్యక్షులు పూజల హరికృష్ణ, మాజీ మంత్రి చంద్రశేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దళితుడిని అర్ధరాత్రి డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించిన చరిత్ర బీఆర్ఎస్ది అని విమర్శించారు.
Mahesh Goud Warning | ఓటు హక్కు కాపాడుకోవాలి
మెదక్ కాంగ్రెస్ ఖిల్లాగా మారుతుందని మహేశ్ గౌడ్ అన్నారు. అర్హత కలిగిన ప్రతి పేదవాడి ఓటు కాపాడటం కోసం కాంగ్రెస్ నాయకులు పని చేశారని పేర్కొన్నారు. 2002 కండిషన్ పేరుతో ఓటు హక్కును తొలగించే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. నోటీసులు వచ్చిన ప్రతి ఒక్కరు వివరాలు అందజేసి ఓటును కాపాడుకోవాలని సూచించారు.
Mahesh Goud Warning | పాతవారికి ప్రాధాన్యం
కష్టపడ్డ కార్యకర్తలకు సొసైటీల్లో పదవులు ఇస్తామని పీసీసీ చీఫ్ ప్రకటించారు. పాతవారికి పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. పార్టీని నమ్ముకున్న పాతవారికి 70 శాతంకి పైగా పదవులు వస్తాయన్నారు. మార్కెట్, సొసైటీ, టెంపుల్, లైబ్రరీ పదవుల్లో పాతవారికి (సీనియర్ నాయకులకు)మొదటి ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
Mahesh Goud Warning | మోదీ ఇంటికే..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని మహేశ్‌గౌడ్ ఎంపీ రఘునందన్‌రావును ప్రశ్నించారు. ఉన్న ఉద్యోగాలు ఉడగొట్టే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. జెన్ జీ ఉద్యమం మోదీకి చెంపపెట్టు అన్నారు. మతం, కులం పేరిట రాజకీయాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడూ వచ్చిన మోదీ ఇంటికే అన్నారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ నేతృత్వంలో 100 సీట్లతో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. కత్తి పట్టుకున్నాడు కత్తి పోటుకు పోయినట్లు.. సోషల్ మీడియాను నమ్ముకున్న కేటీఆర్ అదే గాల్లో కొట్టుకుపోతారన్నారు.
ఇది కూడా చదవండి..: Fee Reimbursement Dues | ఫీజు బకాయిల కోసం బీజేపీ చీఫ్ నిరాహార దీక్ష