అక్షరటుడే, కామారెడ్డి: Fee Reimbursement Dues | పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చేపట్టిన 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా కామారెడ్డి జిల్లా (Kamareddy District) కేంద్రంలో, ఎల్లారెడ్డి పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
Fee Reimbursement Dues | ఫీజుల బకాయి – బీజేపీ లడాయి నినాదంతో..
ఫీజుల బకాయి – బీజేపీ లడాయి నినాదంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని విమర్శించారు. గత కొన్ని విద్యా సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ప్రభుత్వానికి, కళాశాలల యాజమాన్యాలకు మధ్య విద్యార్థుల భవిష్యత్తు నలిగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Fee Reimbursement Dues | ఎల్లారెడ్డిలో..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: పట్టణంలో బీజేపీ శ్రేణులు నిరసన కార్యక్రం నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు అగల్ దివిటీ రాజేష్ అధ్యక్షతన పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి, వినతిపత్రం అందజేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని దేవేందర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా పెండింగ్‌లో ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్, మండల అధ్యక్షుడు పెద్దేండ్ల నర్సింలు, ఎం.సాయిలు, బంజపల్లి శివ, అగల్ దివిటీ గజానన్, జంగం శివ పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Chain Snatching | బస్టాండ్‌లో చైన్‌స్నాచింగ్.. ఇద్దరు మహిళల నగలు మాయం