Fee Reimbursement Dues | ఫీజు బకాయిల కోసం బీజేపీ చీఫ్​ నిరాహార దీక్ష

ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు నిరాహార దీక్ష చేపట్టారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Fee Reimbursement Dues | ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిలు, స్కాలర్​షిప్​లు విడుదల చేయాలని కొంత కాలంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు నిరాహార దీక్ష చేపట్టారు.

నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో రాంచందర్​రావు (Ramchander Rao) సోమవారం నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఉదయం 10 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 3 గంటల పాటు ఈ దీక్ష కొనసాగనుంది. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఫీజుల బకాయి – బీజేపీ లడాయి పేరుతో చేపట్టిన ఈ దీక్షలో ఎంపీ రఘునందన్​రావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్​రెడ్డి, కాటిపల్లి వెంకట్​రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Fee Reimbursement Dues | రూ.15 వేల కోట్ల బకాయిలు

కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకపోవడంతో ప్రభుత్వం విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దాదాపు రూ.15 వేల కోట్ల ఫీజు బకాయిలు పేరుకుపోయాయని పేర్కొన్నారు. వెంటనే బకాయిలు విడుదల చేయాలని బీజేపీ డిమాండ్​ చేస్తోంది. పెండింగ్‌లో ఉన్న ప్రతి రూపాయి విడుదల చేసి, ప్రతి విద్యార్థికి న్యాయం చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని నాయకులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Heavy Rain Alert | తెలంగాణకు నేడు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *