అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Shivakeshava Brahmotsavam | ముస్తాబాద్ (Mustabad) మండల కేంద్రంలోని శివకేశవ ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులుగా వేద పండితులు హరీష్ శర్మ, రంగనాథాచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా యజ్ఞహోమాది కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
Shivakeshava Brahmotsavam | శివకేశవుల విగ్రహాల ఊరేగింపు..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శివకేశవుల ఉత్సవ విగ్రహాలను చావళ్లపై అధిష్టింపజేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం శివకేశవ ఆలయాల్లో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదమంత్రాల నడుమ జరిగిన ఈ కార్యక్రమంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్, ముస్తాబాద్ సర్పంచ్ రెడ్డి, ఆలయ క్యాషియర్ ఆగుళ్ల రాజేశం, కమిటీ సభ్యులు కంచం నరసింహులు, ఎనిమల రాజిరెడ్డి, మట్ట రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: SBI సిబ్బంది నిర్లక్ష్యం తీరు..SMలో వీడియో వైరల్