Terlumaddi Attack Case | తెర్లుమద్దిలో దాడి ఘటనపై డీఎస్పీ విచారణ

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తెర్లుమద్ది గ్రామంలో శనివారం డీఎస్పీ నాగేంద్ర చారి విచారణ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Terlumaddi Attack Case | జిల్లాలోని తెర్లుమద్ది గ్రామంలో శనివారం డీఎస్పీ నాగేంద్ర చారి (Sirisilla DSP) విచారణ చేశారు. డీజే ఆపమన్నందుకు జరిగిన గొడవలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిపై దాడి జరిగినట్లు ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

Terlumaddi Attack Case | డీజే వద్దు అన్నందుకు..

వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 20వ తేదీ రాత్రి తెర్లుమద్ది గ్రామంలోని బొడ్రాయి వద్ద డీజే నడుస్తుండగా, దానిని ఆపాలని గ్రామానికి చెందిన కొమ్మట మధు కోరినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు కలిసి మధు ఇంటి వద్దకు వెళ్లి.. మధుతో పాటు ఆయన భార్య, అన్నపై దాడి చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై బాధితుడు కొమ్మట మధు ఈనెల 23వ తేదీన ముస్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ముస్తాబాద్ ఎస్సై జ్యోతి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో శనివారం (అక్టోబర్ 24) సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి తెర్లుమద్ది గ్రామాన్ని సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను విచారించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించినట్లు తెలిసింది.

ఇది కూడా చదవండి: లగ్జరీ కార్లతో కలరింగ్.. మహిళా పోలీసులే టార్గెట్! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *