అక్షరటుడే, వెబ్‌డెస్క్ : El Nino Effect | ఎల్‌నినో నేపథ్యంలో గ్రామాల్లో ఉపాధి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క (Seethakka) సూచించారు. ఆమె శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన, నీటి సంరక్షణ, శాశ్వత గ్రామీణ ఆస్తుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీతక్క ఆదేశించారు. వీబీ-జీ రామ్ జీ పథకం కింద అనుమతించిన పనులను దశలవారీగా పూర్తి చేయాలన్నారు. ఏడాది పొడవునా కూలీలకు ఉపాధి లభించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో వేగం పెంచని డీఆర్డీఓలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్టోబర్ 30 నాటికి మండలస్థాయి సమన్వయ కమిటీల ఆధ్వర్యంలో పనుల ప్రణాళికలను పూర్తి చేయాలని, నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
El Nino Effect | నీటి సంరక్షణకు..
ఎల్‌నినో నేపత్యంలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. నీటి సంరక్షణ పనులను ముందుగా చేపట్టాలని సూచించారు. కాలువల మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని, చెరువులు, కుంటలు, నీటి నిల్వలు, భూగర్భ జలాల పెంపునకు ఉపయోగపడే పనులను గుర్తించాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ దాన కిషోర్, కమిషనర్ దివ్య దేవరాజన్, ఇంజినీర్-ఇన్-చీఫ్‌లు కృపాకర్ రెడ్డి, జగదీశ్వర్ పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : TGPSC AEE Exam | ఏఈఈ పరీక్షను వాయిదా వేయాలి : హరీశ్‌రావు