Super El Nino | సూపర్​ ఎల్​నినో ప్రమాదకరమైంది : డిప్యూటీ సీఎం భట్టి

వంద దేశాల్లో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super El Nino | వంద దేశాల్లో సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. సూపర్‌ ఎల్‌నినో ప్రమాదకరమైందని చెప్పారు.

లండన్‌ వంటి నగరంలో నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నారని భట్టి అన్నారు. మహారాష్ట్రలో నీటి వాడకంపై కోటా పెట్టారని చెప్పారు. రాజకీయాల కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు. ఎల్‌నినోపై ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామి తెలిపారు.

Super El Nino | జాగ్రత్తగా వాడుకోవాలి

ఇప్పట్లో వర్షాలు కురిసే అవకాశం లేదని, ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. విపత్తు నుంచి కాపాడే బాధ్యత అందరిపై ఉందన్నారు. దీని కోసమే సీఎం మంత్రివర్గ ఉపసంఘం వేశారన్నారు. ప్రజలు సైతం ప్రభుత్వ సూచనలు పాటించి సహకరించాలని కోరారు.

దీనిని కూడా చదవండి : Red Sandalwood | ఎర్రచందనం దుంగల స్వాధీనం.. 8 మంది అరెస్ట్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *