El Nino Effect | ముందున్నది కష్టకాలం.. పొదుపు మంత్రంతోనే భరోసా

ఎల్​నినో ప్రభావంతో రానున్న రోజుల్లో తీవ్ర సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది. ప్రజలు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : El Nino Effect | ఎల్​నినో ప్రభావంతో దేశంలో ఆర్థిక కష్టాలు ప్రారంభం కానున్నాయి. విద్యుత్​, సాగు, తాగు నీరు కొరత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం (Inflation) సైతం మరింత పెరిగే ఛాన్స్​ ఉంది. దీంతో ప్రజలు అన్ని విషయాల్లో పొదుపు మంత్రం పాటించాలి. లేకపోతే కష్టాలు తప్పవు.

మనది వ్యవసాయ ఆధారిత ఆర్థిక (Economics) వ్యవస్థ.. ఒక్క సంవత్సరం వర్షాలు పడకపోతే దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎల్​నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదే. రాష్ట్రంలోని చాలా జలాశయాల్లో (Projects) నీటి మట్టం ఆందోళనకరంగా ఉంది. దీంతో వేసవి వరకు తాగునీరు అందించడమే కష్టం. ఇలాంటి సమయంలో సాగునీరు గురించి ప్రభుత్వాలు పట్టించుకునే ఛాన్స్​ లేదు. దీంతో ప్రజలు రబీలో పంటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. నీరు తక్కువగా అవసరం ఉండే పంటలు వేసుకోవాలి. వ్యవసాయానికి కరెంట్ విషయంలో సైతం కొరతలు ఉంటాయి. అన్నదాతలు జాగ్రత్తలు పాటించాలి.

El Nino Effect | పెరగనున్న రేట్లు

ఎల్​నినో ప్రభావంతో ఇప్పటికే బియ్యం ధరలు ఆకాశాన్ని అంటాయి. రానున్న రోజుల్లో ఇతర పదార్థాల ధరలు భారీగా పెరిగే ఛాన్స్​ ఉంది. వర్షాలు లేకపోవడంతో కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర పంటల సాగుపై తీవ్ర ప్రభావం ఉంటుంది. డిమాండ్​కు తగ్గట్లు సప్లై లేకపోవడంతో పప్పులు, కూరగాయాల ధరలు మండనున్నాయి. దీంతో సామాన్యుల నెలవారీ బడ్జెట్​పై తీవ్ర ప్రభావం పడనుంది. అందుకే ప్రజలు పొదుపు మంత్రం పాటించాలి. విద్యుత్​, నీరు, ఆహార పదార్థాలను పొదుపుగా వాడుకోవాలి.

El Nino Effect | ఆర్భాటాలు వద్దు

రానున్న రోజుల్లో ఉద్యోగాల కోతలు సైతం పెరగనున్నాయి. మరోవైపు పట్టణాలు, నగరాలకు వలస వెళ్లే వారు అధికం అవుతారు. దీంతో పనులు కష్టం అవుతాయి. ఇప్పటి నుంచే ప్రజలు డబ్బులను పొదుపుగా వాడుకోవాలి. అనవసర ఆర్భాటాలకు వెళ్లొద్దు. ఇతరులలా బతకాలని అనవసరంగా అప్పులు చేయొద్దు. ఇప్పటికే ఆర్బీఐ రెపోరేటు పెంచింది. రానున్న రోజుల్లో ద్రవ్యోల్బణం మరింత పెరిగితే వడ్డీ రేట్లు ఇంకా పెరగనున్నాయి. అలా అయితే ఈఎంఐల భారం సైతం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఈఎంఐల జోలికి వెళ్లకపోవడం మంచిది. క్రెడిట్​ కార్డు, ఈఎంఐల పేరుతో అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తే తర్వాత తిప్పలు పడాల్సి వస్తుంది.

El Nino Effect | చమురు ధరలు సైతం..

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. దీంతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఫలితంగా స్టాక్​ మార్కెట్లు (Stock Market) పతనం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ట్రేడర్లు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాల ఇన్వెస్టర్లకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. అయితే నిత్యం ట్రేడింగ్​ చేసే వారు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే భారీగా నష్టపోతారు. లిక్విడిటీ తగ్గడంతో బంగారం కొనుగోళ్లు మందగించి ధరలు దిగివచ్చే అవకాశం ఉంది. అయితే పెట్రోల్​, డీజిల్​ను పొదుపుగా వినియోగించాలి. లేదంటే దేశ ఆర్థిక వ్యవస్థపై సైతం దీని ప్రభావం తీవ్రంగా పడే ఛాన్స్​ ఉంది.

దీనిని కూడా చదవండి : Malakpet Accident | బస్సు కింద పడి నవ వధువు మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *