Malakpet Accident | బస్సు కింద పడి నవ వధువు మృతి

బస్సు కింద పడి ఓ యువతి మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్​ నగరంలో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Malakpet Accident | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నవ వధువు మృతిచెందింది.

సరూర్ నగర్​లో నివాసం ఉంటున్న లావణ్యకు ఆగస్టు 30న శ్రీకాంత్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఆమె శనివారం స్కూటీపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు బస్సు కింద పడిపోయింది. మలక్‌పేటలోని డి-మార్ట్ (D-Mart) సిగ్నల్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా స్కూటీ అదుపు తప్పి లావణ్య కింద పడిపోయింది. ఆమె బస్సు కింద పడగా.. వెనుక టైర్లు లావణ్య మీద నుంచి వెళ్లాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందింది.

Malakpet Accident | చాదర్​ఘాట్​ ఠాణా పరిధిలో..

ఈ ప్రమాదం చాదర్​ఘాట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. లావణ్య మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కొత్తగా పెళ్లయిన ఆమె రెండు నెలలలో మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

దీనిని కూడా చదవండి : Mahabubabad | బావిలో పడి ఇద్దరు పిల్లలతో సహా తల్లి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *